Trending
Friday, 8 December 2017

రివ్యూ : బిటెక్ బాబులు మూవీ - నందు, శ్రీముఖి



బిటెక్ బాబులు అంటే బయట అదొక గౌరవం అనుకోండి, బిటెక్ లైఫ్ ని ఎవరు మరిచిపోలేరు అన్ని మధుర జ్ఞాపకాలు, లవ్ స్టొరీ లు కొంటె పనులు. ఒకప్పటిలా ఈరోజు బిటెక్ లైఫ్ లేదు ఆ లైఫ్ ని మనకు గుర్తు చేయడానికి తీసిన సినిమానే బిటెక్ బాబులు. ఇక మనం బి టెక్ లో మిస్ అయ్యిన లైఫ్ ని ఈ సినిమా ఎంతమేరకు గుర్తు చేసిందో పూర్తి రివ్యూ లో తెలుసుకుందాం.

నందు, శ్రీముఖి, అలీ ప్రధాన తారాగణం గా జె.పి క్రియేషన్స్ పతాకంపై శ్రీను ఈమంది దర్శకత్వంలో ధనా జమ్ము రూపొందించిన చిత్రం ‘బిటెక్ బాబులు’.

ఇంజినీరింగ్ కాలేజీలో కాలేజీ నలుగురు యువకులు, ముగ్గురు అమ్మాయిల మధ్య చోటుచేసుకొన్న స్నేహం, ప్రేమ అంశాల మేలవింపే బీటెక్ బాబులు చిత్ర కథ. స్నేహంలో మధురానుభూతి, ప్రేమలో మనస్పర్థలు, కాలేజీ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలను తెర రూపమే బీటెక్ బీటెక్ బాబులు చిత్రం.మూడు ప్రేమ జంటల మధ్య వచ్చిన విభేదాలు ఏంటీ? వారి ప్రేమకు అడ్డంకిగా మారిన అంశాలేమిటి? ఈ కథలో నందు, శ్రీముఖ కథేంటి? షకలక శంకర్, తాగుబోతు రమేశ్, ఆలీ కథకు ఎలా ఉపయోగపడ్డాడు? అనే ప్రశ్నలకు సమాధానమే బీటెక్ బాబులు. పెళ్ళిచూపులు త‌ర్వాత నందు చాలా మంచి పాత్రలో కనిపించాడు.  అతని పాత్ర ప్ర‌తీ ప్రేమికుడికి క‌నెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. శ్రీ ముఖి మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది.

నందు శ్రీముఖి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు దర్శకుడు శ్రీను ఈమంది చక్కగా తెరకెక్కించారు. శంకర్ ఫ్రమ్ శ్రీకాకుళం అంటూ షకలక శంకర్ చేసిన కామెడీ బాగుంది , కామెడీ , సెటిమెంట్ సీన్స్ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు  , యువతకు ఎక్కువ నచ్చే స‌న్నివేశాలు హైలైట్ గా తీర్చిదిద్దారు. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ పడకుండా నిర్మించారు.


ప్లస్ పాయింట్స్ :
– సినిమాటోగ్రఫీ
– మ్యూజిక్ 
– లవ్ మెసేజ్
– షకలక శంకర్ కామెడీ
చిత్ర తారాగ‌ణంః నందు, శ్రీముఖి, ష‌క‌ల‌క శంక‌ర్, రాణి, నావ‌ల్ కిషోర్, వైజాగ్ శంక‌ర్, అశ్విని, శౌర్, రోషిణి, మ‌నీషా, తాగుబోతు రమేష్, అలీ, ప‌విత్రా లోకేష్, వైవా హ‌ర్ష‌, రాకెట్ రాఘ‌వ‌, ప‌టాస్ ప్ర‌కాష్ , సాంకేతిక విభాగం: సినిమాటోగ్ర‌ఫీ : సాయిచ‌ర‌క్ మాధ‌వ‌న్‌ని , సంగీతం: అజ‌య్ ప‌ట్నాయ‌క్,  దర్శకుడుః శ్రీను ఈమంది , నిర్మాతః ధన జమ్మూ

బిటెక్ బాబులు  రేటింగ్ : 3.5/5

బిటెక్ బాబులు – Trailer

Next
This is the most recent post
Older Post

No comments:

Item Reviewed: రివ్యూ : బిటెక్ బాబులు మూవీ - నందు, శ్రీముఖి Rating: 5 Reviewed By: TeluguPeople Adda