Trending
Monday, 26 December 2016

సినీన‌టి హేమ‌పై సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం


తెలుగులో మ‌హిళా క‌మెడియ‌న్లు చాలా అరుదు. ఉన్న వాళ్ల‌ని వేళ్ల‌పై లెక్క‌పెట్ట‌వచ్చు.
అయితే శ్రీ‌ల‌క్ష్మి త‌రువాత కామెడీలో ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న న‌టి హేమ‌. అన్ని పాత్ర‌ల్లోనూ ఒదిగిపోయి త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె!! ఇక న‌టుడు బ్రహ్మానందం-హేమ కాంబినేష‌న్‌లో వచ్చిన స‌న్నివేశాల‌న్నీ ప్రేక్ష‌కుల‌కు గిలిగింత‌లు పెట్టేవే!! అయితే హేమ‌ చిన్న టైప్ పోర్న్ సినిమాల్లో నటించింద‌ని కొన్ని వెబ్‌సైట్ల‌లో ఒక‌ వార్త హ‌ల్‌చ‌ల్ చేసింది. సోష‌ల్ మీడియాలోనూ ఈ వార్త సంచ‌ల‌నం సృష్టించింది. గ‌త నాలుగైదు రోజులుగా ఈ వార్త జోరుగా ట్రెండ్ అవుతోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే హేమ తెలుగులోకి రాక‌ముందు త‌మిళంలోనూ కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించారు.

మంచి క‌థాంశం గ‌ల సినిమాలో న‌టించిన ఓ స‌న్నివేశం ఆధారంగా కొన్ని వెబ్‌సైట్లు ఆమెపై ఈ ర‌క‌మైన ప్ర‌చారం చేశాయి. ఒక వార్త‌ను ప్ర‌చురించే ముందు అందుకు సంబంధించిన పూర్వాప‌రాలను విచారించ‌కుండానే కొన్ని సైట్లు ఇటువంటి నిరాధార వార్త‌ల‌ను ప్ర‌చురించేస్తున్నాయి. దీంతో నైతిక విలువ‌ల‌కు ఆ సైట్లు తిలోద‌కాలిస్తున్నాయి. ముఖ్యంగా వెబ్‌సైట్ల మ‌ధ్య పోటీ పెరుగుతున్న నేప‌థ్యంలో.. ఆ సైట్లు నైతిక‌ విలువ‌ల‌ను పాటించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. సంచ‌ల‌నం కోసం పాకులాడ‌కుండా, వ్య‌క్తుల మ‌నోభావాల‌కు భంగం క‌లిగించ‌కుండా వార్త‌ల‌ను ప్ర‌చురించాల్సిన గురుత‌ర బాధ్య‌త వెబ్‌సైట్ల యాజ‌మాన్యంపై ఉంది. గ‌తంలోనూ వెబ్‌సైట్లు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఇక నుంచైనా వెబ్‌సైట్లు రూమ‌ర్స్‌ను ప‌ట్టించుకుకోకుండా.. వాస్త‌వాల‌ను విచారించి ప్ర‌చురిస్తే బాగుంటుంది.
Next
This is the most recent post
Older Post

No comments:

Item Reviewed: సినీన‌టి హేమ‌పై సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం Rating: 5 Reviewed By: TeluguPeople Adda