Trending
Friday, 26 February 2016

అభిమాని మీద ప్రేమ చాటుకున్న విక్రమ్

తమిళనాడు లో చియాన్ అని ముద్దుగా అభిమానులతో పిలిపించుకునే హీరో " విక్రమ్ ". అభిమానులకు విక్రమ్ చాల గౌరవం ఇస్తాడని చాల మంది చెప్తుంటారు. ఈ విషయం ఇప్పటి వరకు విన్న తమిళ సినీ జనం కి కళ్ళారా చూపించి తన ప్రేమ ను చాటుకున్నాడు చియాన్ విక్రమ్.

ఈ మధ్య చెన్నై లో ఆసియా నెట్ అవార్డుల కార్య‌క్ర‌మంలో పాల్గొనడానికి విక్రమ్ విచ్చేసాడు. ముందు సీట్లలో కూర్చున్న విక్రమ్ ని చూసేందుకు అక్కడ ఫాన్స్ గేలరీ లో అభిమానులు ఉత్సాహం చూపించారు.అందులో ఒక వీరాభిమాని విక్రమ్ ని హాగ్ చేసుకోడానికి ముందుకు వచ్చాడు. ఈలోపు అక్కడే ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఆ అభిమానిని అడ్డుకొని వెనక్కి లాగబోయారు.

ఈ సంఘటనను కళ్లారా చూసిన విక్రమ్ , ఆ ఫ్యాన్ ని పిలిచి సేల్ఫీ దిగాడట, సేల్ఫీ దిగడమే కాకుండా హాగ్ కూడా ఇచ్చి కొంచెం మాట్లాడి పంపాడట . విక్రమ్ అభిమానికి ఇచ్చిన గౌరవం చూసి అందరు షాక్ అయ్యారట. ఏది ఏమైనా విక్రమ్ మాత్రం తన ప్రేమని చాటుకున్నాడు.

No comments:

Item Reviewed: అభిమాని మీద ప్రేమ చాటుకున్న విక్రమ్ Rating: 5 Reviewed By: TeluguPeople Adda