Trending
Friday, 26 February 2016

ఢిల్లీ లో సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా బ్రహ్మోత్సవం షూటింగ్ హైదరబాద్ లో పూర్తి అయ్యింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఢిల్లీ లో ఉంటుందని సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు 12 రోజుల పాటు సాగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే 50 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే లో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.

 ఈ సినిమాలో మహేష్ సరసన , సామంత , కాజల్ , ప్రణిత నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా మీద అభిమానులు భారి అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా కి మహేష్ బాబు ఎక్కువ రేమ్యునేరేషణ్ తీసుకున్నాడు అని సమాచారం. ఏది ఏమైనా మళ్ళి ఫ్యామిలి ఎంటర్టైనర్ తో వస్తున్న మహేష్ మళ్ళి పెద్ద హిట్ కొడతాడని ట్రేడ్ విశ్లేషకుల అంచన.

 ఇంకో వైపు మహేష్ ఈ సినిమా తర్వాత మురుగ దాస్ సినిమా చేస్తున్నాడు , అందుకే ఈ సినిమా షూటింగ్ ని సాధ్యమైనంత త్వరగా పూర్హి చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

No comments:

Item Reviewed: ఢిల్లీ లో సూపర్ స్టార్ Rating: 5 Reviewed By: TeluguPeople Adda