Trending
Thursday, 25 February 2016

ఈ సారి చరణ్ మెప్పిస్తాడా ?

చిరంజీవి నట వారసుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. తన తొలి సినిమాతోనే అందరి ప్రశంసలు అందుకొని రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఆరంజ్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ చరణ్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. రచ్చ , ఎవడు , నాయక్ లాంటి మాస్ సినిమాలు చరణ్ కెరీర్ కి బాగా హెల్ప్ అయ్యాయి కాని నటన పరంగా చరణ్ ఇంకా పరిణితి సాధించాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఇప్పుడున్న హీరోలందరూ సినిమా కి ఒక్కో టైపు లుక్ స్టైల్ తో అలరిస్తుంటే , చరణ్ మాత్రం సదా సీదాగా సి
నిమాలు చేస్తున్నాడు చరణ్ సినిమాలలో కొత్తదనం లేకపోవడం , ఒకే రకమైన నటన , ఇలా ఎన్నో అంశాలు చరణ్ కి దెబ్బ వేస్తున్నాయి. చరణ్ నుండి ఇంకో ఎవడు , రచ్చ , నాయక్ సినిమాలను ప్రేక్షకులు అభిమానులు ఆశించాట్లేదు. చరణ్ కొత్త తరహ్ సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నారు.

అయితే , ఈ సారి చరణ్ పూర్తి స్థాయి మాస్ సినిమా కాకుండా మంచి కంటెంట్ ఉన్న రీమేక్ సినిమాను పట్టుకున్నాడు. ఈ సినిమా లో చరణ్ నటన కు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మరి ఈసారైన చరణ్ మెప్పిస్తాడో లేదో చూడాలి.

No comments:

Item Reviewed: ఈ సారి చరణ్ మెప్పిస్తాడా ? Rating: 5 Reviewed By: TeluguPeople Adda