Trending
Friday, 26 February 2016

చరణ్ కోసం యు ఎస్ కి సుకుమార్

నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత సుకుమార్ దేవి శ్రీ తో సినిమా చేస్తానని ప్రకటించాడు. దిల్ రాజు బ్యానర్ లో దేవి శ్రీ ని హీరో గా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు కాని ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు లేదని తెలుస్తుంది. సుకుమార్ తదుపరి చిత్రం , రామ్ చరణ్ తో ఉంటుందని సమాచారం. ఈ సినిమా విషయం మీదనే సుకుమార్ యు ఎస్ వెళ్ళాడని ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నాయి.

 చరణ్ సినిమా స్టొరీ సిట్టింగ్స్ కోసమే సుకుమార్ యు ఎస్ వెళ్ళాడని , ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించే అవకాశం కూడా ఉందని సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతానికి రామ్ చరణ్ , సురేందర్ రెడ్డి దర్శకత్వం లో " ధ్రువ " అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్ సినిమా మొదలవుతుందని ప్రాథమిక సమాచారం.

మరి చరణ్ ని కూడా సుకుమార్ క్లాసు గా మారుస్తాడో లేదో చూడాలి.సుకుమార్ సినిమా అనగానే హీరో లూక్స్ అంత కొత్తగా ఉంటుంది , చరణ్ ని కొత్తగా చూడాలని అభిమానులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు.

No comments:

Item Reviewed: చరణ్ కోసం యు ఎస్ కి సుకుమార్ Rating: 5 Reviewed By: TeluguPeople Adda