Trending
Friday, 26 February 2016

సమస్యగా మారిన రజిని ఆరోగ్యం

సూపర్ స్టార్ రజిని కాంత్ ఆరోగ్యం మీద భిమానులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే , ప్రస్తుతానికి రజిని కాంత్ కబలి షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇంకో వైపు శంకర్ రోబో 2.0 కి సనహలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రజిని ఆరోగ్యం అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది.

రజిని ఈ మధ్య కొన్ని ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నాడని , ఇటివల చెన్నై లో ఒక ప్రైవేటు ఆసుపత్రి లో టెస్ట్ లు కూడా చేపించుకున్నాడని సమాచారం. ఈ సమస్యలు వయస్సు రిత్య వచ్చినవే కాని పెద్దగా ప్రమాదకరం కాదని డాక్టర్లు చెప్తున్నారు.

ఇంకో వైపు రజిని ఈ ఏజ్ లో కొంచెం జాగ్రత్తగా ఉంటె మంచిదని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకు ముందు రజిని " రానా " సినిమా మొదలు పెట్టి ఇలాగె ఆరోగ్యం బాగోలేక సినిమాని ఆపేసాడు. ఇప్పుడు మరి అంత విషమంగా లేకపోయినా , ముందు జాగ్రత్తగా రజిని ఆరోగ్యం చూసుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

No comments:

Item Reviewed: సమస్యగా మారిన రజిని ఆరోగ్యం Rating: 5 Reviewed By: TeluguPeople Adda