Trending
Friday, 26 February 2016

హాలీవుడ్ లోకి పూరి హీరోయిన్

మన బాలీవుడ్ లో హీరోయిన్లు హాలీవుడ్ కి వెళుతుంటారు.కాని మన తెలుగు లో చేసిన హీరోయిన్లు హాలీవుడ్ లో వెళ్ళడం చాల అరుదు. ఇక ఇలాంటి అరుదైన ఘనత సాధించింది లోఫర్ సినిమా హీరోయిన్ " దిశా పటాని " . దిశా లోఫర్ సినిమా తర్వాత ఒక బాలీవుడ్ చిత్రం కూడా చేసింది.

 అయితే , ఇప్పుడు ఈ అమ్మడు ఒక హాలీవుడ్ సినిమాకి సైన్ చేసిందట. అది కూడా జాకిచాన్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. జాకిచాన్ హీరో గా 'కుంగ్ ఫూ యోగా' సినిమా రానుంది. ఈ సినిమాలో దిశా కీలక పాత్ర లో నటిస్తున్నట్లు సమాచారం. స్టాన్లీ టాంగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో దిశా ఆర్కియాలజీ ప్రొఫెసర్ లో కనిపించనుంది.

ఈ సినిమా కోసం దిశా చాల కష్టపడుతుందని సన్నిహితులు చెప్తున్నారు.కేవలం రెండు సినిమాలతోనే హాలీవుడ్ లో ఛాన్స్ కొట్టెయ్యడం అంటే మాములు విషయమా చెప్పండి ? మరి ఈ అమ్మడు మల్లి తెలుగు , హిందీ సినిమాలలో నటిస్తుందో లేదో చూడాలి.

No comments:

Item Reviewed: హాలీవుడ్ లోకి పూరి హీరోయిన్ Rating: 5 Reviewed By: TeluguPeople Adda