Trending
Friday, 26 February 2016

సంచలనం :చిరు - బాలయ్య మధ్యలో మాటల యుద్ధం

చిరు , బాలయ్య మధ్యలో వేడి వాతావరణం మొదలయ్యింది. ఈ మద్య చిరు , బాలయ్య బాగా కలిసిపోయారని చాల మంది అనుకున్నారు , అందులో చాల వరకు నిజం కూడా ఉంది కాని ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తుంటేనే పరిస్థతి గతి తప్పినట్లు కనిపిస్తుంది.వివరాల్లోకి వెళితే , ఈరోజు బాలయ్య లేపాక్షి ఉత్సవాల దగ్గర ప్రెస్ తో ముచ్చటించారు.

 ఈ సందర్భంగా చిరు ప్రస్తావన వచ్చింది , చిరు ని ఎందుకు పిలవలేదు అని అడిగిన ప్రశ్నకు బాలయ్య ఘట్టిగా సమాధానం ఇచ్చాడు, అందర్నీ నెత్తిన ఎక్కించుకొను అని కావాల్సిన వల్లనే పిలుస్తానని బాలయ్య వ్యాఖ్యానించాడు. తన పక్కన గ్లామర్ గా కనిపించే వాళ్ళు చాల మంది ఉన్నారని బాలయ్య అన్నారు, ఇదే విషయాన్నీ చిరు దగ్గర ప్రస్తావిస్తే , చిరు కూడా కొంచెం వెటకారంగా స్పందించాడు.

 బాలయ్య చిన్న పిల్ల వాడి మనస్తత్వం అని , ఆయన మాటలు పట్టించుకోను అని నవ్వుతు సమాధానమిచ్చాడు చిరు. ఇద్దరి మాటలు ఎలా ఉన్న , అభిమానులు మాత్రం మళ్ళి కొట్టుకోవడం మొదలు పెట్టారు. మరి ఈ గొడవ ఎప్పుడు ఆగుతుందో చూడాలి.

No comments:

Item Reviewed: సంచలనం :చిరు - బాలయ్య మధ్యలో మాటల యుద్ధం Rating: 5 Reviewed By: TeluguPeople Adda