Trending
Tuesday, 29 December 2015

స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే ‘దేవాలయము’

Telugu Movie Devalayamu


ఎక్క‌డ స్త్రీలు పూజించ‌బ‌డ‌తారో అక్క‌డ దేవ‌త‌లుంటారు.. ఇది నోటి మాటగా, వాక్యంగా మిగిలిపోయిందంతే. మ‌న స‌మాజంలో స్త్రీకి ప్ర‌త్యేక‌మైన గౌర‌వ స్థాన‌ముంది. అయితే అటువంటి స్త్రీల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాలు ఎన్నో. ప్రభుత్వం, కోర్టు నిర్భ‌య వంటి ఎన్నో చ‌ట్టాలు చేసిన స్త్రీల‌పై జ‌రుగుతున్న మార‌ణ‌కాండ రోజు రోజుకి పెరుగుతుందే కానీ త‌గ్గ‌డం లేదు. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే ఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రుగుతున్నాయి. వీటిని ప్ర‌శ్నిస్తూ రూపొంద‌నున్న చిత్ర‌మే ‘దేవాలయం’. ధ‌న్య‌త డిజిట‌ల్స్‌, ఐక్య‌త చ‌ల‌న చిత్ర‌ము బ్యాన‌ర్స్‌పై శ్రీ స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. త్వ‌ర‌లోనే న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.

No comments:

Item Reviewed: స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే ‘దేవాలయము’ Rating: 5 Reviewed By: TeluguPeople Adda