Trending
Tuesday, 20 October 2015

బుల్లితెరపైనా భాయిజాన్ వంద కోట్లను కొల్లగొడుతుందా?


ఒకవైపు బుల్లితెరపై రావటానికి 'బాహుబలి' సిద్దం అవుతుంటే మరోవైపు 'బజరంగీ భాయిజాన్' బుల్లితెరలో వచ్చి సంచలనాలను సృష్టించింది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు కథను అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. 'బజరంగీ భాయిజాన్' సినిమా మొన్న ఆదివారం టివిలో ప్రసారం అయ్యి కాసుల వర్షాన్ని కురిపించింది. బుల్లితెరలో ప్రసారం అయిన ఈ సినిమాకు యాడ్స్ రూపంలో అక్షరాలా అరవై కోట్ల రూపాయలు వచ్చినట్టు సమాచారం. ఈ సినిమా మొదటి సారి టెలికాస్ట్ చేసినప్పుడే 60 కోట్లు వస్తే రెండో సారి టెలికాస్ట్ చేసినప్పుడు సుమారుగా 50 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగితే బుల్లితెరపై కూడా వంద కోట్ల క్లబ్ అనే మాట వినిపిస్తుంది. ఈ సినిమాకు అమెజాన్ ఇండియా, ఆస్క్ మి డాట్ కాం వంటి సైట్స్ భారీ స్థాయిలో యాడ్స్ ఇచ్చాయి. ఇదే ఇన్ని సంచలనాలను నమోదు చేస్తే 'బాహుబలి' ఎన్ని సంచలనాలను నమోదు చేస్తుందో చూడాలి.

No comments:

Item Reviewed: బుల్లితెరపైనా భాయిజాన్ వంద కోట్లను కొల్లగొడుతుందా? Rating: 5 Reviewed By: TeluguPeople Adda