Trending
Wednesday, 7 October 2015

నో అన్న....యస్ అన్న సినిమా ప్లాపే


టాలీవుడ్ లో యంగ్ హీరోలు నితిన్,రామ్ సినిమాలు ఎంత ఎంచుకొని చేసినా మంచి పలితాన్ని రాబట్టలేకపోతున్నారు. నితిన్ హీరోగా వచ్చిన 'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమా మూడు సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదలకు నోచుకోని ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. నితిన్ ఈ పరాజయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అఖిల్ సినిమా మీద మొత్తం దృష్టి పెట్టేసాడు. ఎందుకంటే ఆ సినిమాకి నితిన్ నిర్మాత కదా. ఇంకా రామ్ 'శివం' తో ముందుకు వచ్చి ప్లాప్ టాక్ తెచ్చుకున్నాడు.

ఇక్కడ ఒక  ట్విస్ట్ ఉంది. రామ్ చేసిన 'శివం' సినిమా ముందుగా నితిన్ దగ్గరకు వెళ్ళింది. నితిన్ నో చెప్పటంతో రామ్ వద్దకు వచ్చి ఫైనల్ అయ్యింది. మరో వైపు కొరియర్ బాయ్ కళ్యాణ్' మొదట రామ్ వద్దకు వస్తే నో చెప్పటంతో నితిన్ వద్దకు వెళ్ళింది. నితిన్ ఎస్ అని చెప్పటంతో సినిమా పట్టాలేక్కింది. అయితే అటు నో అన్న సినిమా.. ఎస్ అన్న సినిమా రెండూ షాక్ ఇవ్వడంతో.. రామ్, నితిన్ లు ఆలోచనలో పడ్డారట. మరి సినిమాల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తారో లేదో ఈ యంగ్ హీరోలు చూడాలి.

No comments:

Item Reviewed: నో అన్న....యస్ అన్న సినిమా ప్లాపే Rating: 5 Reviewed By: TeluguPeople Adda