Trending
Tuesday, 6 October 2015

సందీప్ కిషణ్ విలన్ గా నటిస్తాడా?


రామ్ చరణ్ నటిస్తున్న 'బ్రూస్ లీ' సినిమా దాదపుగా పూర్తి కావొచ్చింది. ఈ సినిమా అయిన తర్వాత మరో రీమేక్ సినిమా చేయటానికి సిద్దం అయిన సంగతి తెలిసిందే. తమిళ సినిమా 'తనీ ఒరువన్' ను తెలుగులో 'బ్రూస్ లీ' నిర్మాత దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. తమిళ సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా నటించి మెప్పించాడు.

అయితే తెలుగు సినిమా విషయానికి వచ్చే సరికి మొదట అరవింద్ నే తీసుకుందామని భావించారు. కానీ తెలుగు వారైతే బాగుంటుందని రానా ని అనుకున్నారు. కానీ రానా బాహుబలి 2 తో బిజీగా ఉండుటచే ఈ ప్రాజెక్ట్ చేయటానికి ముందుకు రాలేదు. ఆ తర్వాత కింగ్ నాగార్జున పేరు వినిపించింది. ఈ విషయాన్ని నాగ్ ఖండించాడు. దాంతో ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తారో అనేది క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే ఇప్పుడు మరొక పేరు తెర మీదకు వచ్చింది. అతనే సందీప్ కిషన్. సందీప్ కిషన్ గతంలో విలన్ గా నటించిన,ప్రస్తుతం హీరోగా బిజీగా మారిపోయాడు. ఇటువంటి పరిస్థితిలో సందీప్ విలన్ గా నటించటానికి ముందుకు వస్తాడో లేదో డౌటే.

No comments:

Item Reviewed: సందీప్ కిషణ్ విలన్ గా నటిస్తాడా? Rating: 5 Reviewed By: TeluguPeople Adda