Trending
Thursday, 1 October 2015

సక్సెస్ నానికి నిర్మాతలకు దూరం పెంచిందా?


సాదారణంగా ఎవరికీ అయిన పరాజయం అనేది దూరాన్ని పెంచుతుంది విజయం అనేది దగ్గర చేస్తుంది. కానీ యంగ్ హీరో నాని విషయంలో ఇది తారుమారు అయ్యింది. హిట్ ముఖం చూసి చాలా కాలం అయిన నాని 'భలే భలే మగాడివోయ్' సినిమా రూపంలో మంచి హిట్ దొరికి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సక్సెస్ నానికి నిర్మాతలకు దూరాన్ని పెంచింది. అది ఎలా అంటే...ఈ సినిమాని నిర్మించిన అల్లు అరవింద్,యు.వీ. క్రియేషన్స్ వారు ఈ సినిమా విడుదలకు ముందే మరో సినిమాను నానితో చేయటానికి కమిట్ అయ్యారు.

అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలేక్కుతుందో లేదో అనుమానంగా మారింది. ఎందుకంటే 'భలే భలే మగాడివోయ్' సినిమా సక్సెస్ తర్వాత నాని ఆలోచనల్లో మార్పు వచ్చిందని అరవింద్ క్యాంప్ అంటోంది. ఈ సినిమా హిట్ తో నాని తన పారితోషికాన్ని డబుల్ చేసేసాడు. అలాగే ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావటంతో భారీ బిజినెస్ జరిగి మంచి లాభాలు రావటంతో ఈ సినిమా రన్ గురించి నిర్మాతలు పట్టించుకోవటం లేదని నాని  కినుక వహించాడట. దాంతో వారి మధ్య దూరం పెరిగినట్టు సమాచారం. అయినా 'భలే భలే మగాడివోయ్' విజయంతో దర్శకుడు మారుతి వెంట అగ్ర హీరోలు వెంట పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఇటు మారుతి గాని, అటు నిర్మాతలు కానీ నానితో సినిమా తీయటానికి సిద్దంగా లేరు.

No comments:

Item Reviewed: సక్సెస్ నానికి నిర్మాతలకు దూరం పెంచిందా? Rating: 5 Reviewed By: TeluguPeople Adda