Trending
Friday, 2 October 2015

సోగ్గాడు రీ షూట్ కాలేదా?


నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న 'సోగ్గాడే చిన్ని నాయనే' సినిమా
ప్రారంభం అయ్యి చాలా కాలం అయినా ఇప్పటికి పూర్తి కాకపోవటంతో ఈ సినిమాపై ఎన్నో పుకార్లు హాల్ చల్ చేస్తున్నాయి. నాగ్ కి కొన్ని సన్నివేశాలు నచ్చక మళ్లీ రీ షూట్ చేసారని,అలాగే కొంత కథను కూడా మార్చారని అనేక ఊహగానాలు వచ్చాయి. అయితే నాగార్జున ప్రస్తుతం తన కొడుకు అఖిల్ సినిమా మీద పూర్తిగా దృష్టిని పెట్టటం వలన నాగ్ ప్రాజెక్ట్ విషయంలో జాప్యం జరిగిందని చిత్ర యూనిట్ మీడియాలో వస్తున్న వార్తలకు ఒక క్లారిటీ ఇచ్చింది.
 పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆత్మల నేపధ్యంలో సాగుతుందని సమాచారం. ఈ సినిమాలో నాగ్ రమ్యకృష్ణ,లావణ్య త్రిపాఠి లతో రోమాన్స్ చేయనున్నాడు. ఈ మధ్యనే విడుదల అయ్యిన టీజర్ కి కూడా మంచి స్పందన వచ్చింది.  అయితే నాగార్జున కూడా సినిమా విడుదల విషయంలో కంగారు పడటం లేదు. ఎందుకంటే తన కొడుకల సినిమాలు వరుసగా అక్టోబర్ లో  'అఖిల్' సినిమా .. నవంబర్లో నాగచైతన్య సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో' ఉండటంతో నాగార్జున సంక్రాంతికి షిఫ్ట్ అయ్యాడని సమాచారం. ఈ కథ పల్లెటూరి నేపథ్యం.... కుటుంబ నేపధ్యం కలిగి ఉండుట వలన సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు.

No comments:

Item Reviewed: సోగ్గాడు రీ షూట్ కాలేదా? Rating: 5 Reviewed By: TeluguPeople Adda