చాలా రోజుల నుంచి శంకర్ 'రోబో 2' కథ ను ఫైనల్ చేయటంలో మునిగిపోయాడు. కథను రజనీకాంత్ కి చెప్పి ఒకే చేయించుకున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా విలన్ విషయం దగ్గర ఆగింది. మొదట విలన్ గా కమలహాసన్ అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత విక్రమ్ ని తీసుకుందామని అనుకున్నారు. విక్రమ్ అల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాడనే అనుకొనే సమయంలో నిర్మాతల ఒత్తిడి మేరకు శంకర్ బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్,షారుక్ ఖాన్ లను కలిసాడు. 'రోబో 2' లో విలన్ పాత్ర ఎంత ఇంపార్టెన్స్ ఉందో వారికీ చెప్పినా సరే వారు సున్నితంగా తిరస్కరించారు.
ప్రస్తుతం 'రోబో 2' విలన్ విషయంలో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ నటిస్తాడనే వార్త వినపడుతుంది. శంకర్ టీం ఆర్నాల్డ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. 'శంకర్' 'ఐ' ఆడియో వేడుకలకు హాజరు అయిన ఆర్నాల్డ్....ఆ వేడుకల్లో శంకర్ ని తన పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ నేపధ్యంలో శంకర్ సినిమాలో ఆర్నాల్డ్ నటించినా ఆశ్చర్యం పోనవసరం లేదు.
No comments: