Trending
Monday, 5 October 2015

దీపావళి కి రెడీ అవుతున్న మాస్ మహారాజ్మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రాధామోహన్ నిర్మిస్తున్న 'బెంగాల్ టైగర్' సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా ఆడియో ను ఈ నెల 18 న భారీ స్థాయిలో చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. రవితేజ గత సినిమా 'కిక్ 2' నిరాశ పరిచటంతో ఈ 'బెంగాల్ టైగర్' సినిమా మీదే గంపెడు ఆశలు పెట్టుకొని పుల్ ఎనర్జీతో నటించాడట.

ఈ సినిమాలో రవితేజ తమన్నా,రాశి ఖన్నా తో రోమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ ఎనర్జీతో పాటు తమన్నా గ్లామర్ ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ సినిమా దర్శకుడు సంపత్ నంది కి కూడా ఈ సినిమా కీలకమే. ఎందుకంటే సంపత్ కి   'రచ్చ' సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఈ సినిమా కథ రవితేజ బాడీ లాంగ్వేజ్‌కి సెట్ అయ్యే విధంగా తీర్చిదిద్దారట. అంతేకాక యాక్షన్ సన్నివేశాలు కూడా హై ఎనర్జీతో చిత్రీకరణ చేసారట. అంతేకాక ఈ సినిమాలో  హాస్య బ్రహ్మ....బ్రహ్మానందం మరోసారి తన మార్క్ కామెడీతో నవ్వించటానికి సిద్దం అయిపోయాడు. రవితేజ, బ్రహ్మానందం కాంబినేషన్ కామెడి ఎలా ఉంటుందో మనకు తెలిసిన విషయమే కదా.

No comments:

Item Reviewed: దీపావళి కి రెడీ అవుతున్న మాస్ మహారాజ్ Rating: 5 Reviewed By: TeluguPeople Adda