Trending
Tuesday, 20 October 2015

ఆ హీరోయిన్ లిప్ లాక్ ఇస్తే...ప్లాపేనా


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న 'బ్రూస్ లీ' సినిమాలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకి లిప్ లాక్ సెంటిమెంట్ అడ్డు వస్తుంది. రకుల్ సినీ పరిశ్రమకు వచ్చిన దగ్గర నుంచి లిప్ లాక్ లకు సై అని అభిమానులకు కనువిందు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రకుల్ లిప్ లాక్ ఇస్తే సినిమా ప్లాపే అనే ఫిల్మ్ నగర్ లో షికారు చేస్తుంది. ఇప్పటివరకు ఆమె ముగ్గురు హీరోలకు లిప్ లాక్ ఇస్తే ఆ మూడు సినిమాలు ప్లాప్ లిస్టు లో చేరిపోయాయి. రకుల్ తన లిప్ లాక్ తో అభిమానులకు కనువిందు చేసినా నిర్మాతలు మాత్రం వీధిన పడుతున్నారు. ఇప్పుడు ఈ అమ్మడు 'బ్రూస్ లీ' సినిమాలో కూడా చరణ్ తో లిప్ లాక్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మెగా అభిమానులు ఈ సెంటిమెంట్ తో సినిమా విజయంపై డైలమాలో పడ్డారు. రకుల్ సెంట్ మెంట్ ని కంటిన్యూ చేస్తుందో... బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి.

No comments:

Item Reviewed: ఆ హీరోయిన్ లిప్ లాక్ ఇస్తే...ప్లాపేనా Rating: 5 Reviewed By: TeluguPeople Adda