Trending
Saturday, 10 October 2015

గర్భాదరణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

గర్భాదరణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

ప్రతి మహిళకి  గర్భం  ధరించటం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అయితే
కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటమే కాకా గర్భంలో ఉన్న
పిండం కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.

* గర్భవతులు తమ ఆహారంలో వీలు ఉన్నంత వరకు తాజా పండ్లు,ఆకుకూరలు,పచ్చని
కూరగాయలు తీసుకోవాలి.

* కాఫీ,టీ లను త్రాగకుండా ఉంటే మంచిది. వీటిల్లో ఉండే కెఫీన్ గర్భస్థ
శిశువుకు హాని చేస్తాయి.

* డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి మందులను వాడకూడదు.

* ఎక్కువసేపు నిల్చుని ఉండకూడదు. అలాగే ఎక్కువసేపు కాళ్ళు ముడుచుకొని
కూర్చోవటం కూడా మంచిది కాదు.

* పడుకొనే సమయంలో ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలి. దీని వల్ల గర్భంలోని
శిశువుకు తగినంత ఆక్సిజన్ అందుతుంది.

* రాత్రి సమయంలో తప్పనిసరిగా ఎనిమిది గంటల నిద్ర అవసరం.

* నీరు ఎక్కువగా త్రాగాలి. దీని వల్ల మలబద్దకం, యూరినరీ బ్లాడర్ లో వచ్చే
ఇన్ ఫెక్షన్స్ దరి చేరవు.

 * వాకింగ్ చేసేటప్పుడు వేగంగా నడవకూడదు.

* గర్భవతులు తమ సాదారణ దినచర్యలో ఎటువంటి మార్పులను చేసుకోవలసిన అవసరం లేదు.

No comments:

Item Reviewed: గర్భాదరణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు Rating: 5 Reviewed By: TeluguPeople Adda