Trending
Saturday, 10 October 2015

ప్రభాస్ ఒత్తిడికి గురి అవుతున్నాడా?

ప్రభాస్ ఒత్తిడికి గురి అవుతున్నాడా?

ప్రభాస్ ఒత్తిడికి గురి అవుతున్నాడా? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే 'బాహుబలి 2' సినిమా ప్రారంభం ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు. బాహుబలి పార్ట్ రెండో బాగం పూర్తి అయ్యేవరకు వేరే ఏ సినిమా ఒప్పుకోవటానికి వీలు లేదని రాజమౌళి ప్రభాస్ కి తేల్చి చెప్పేసాడు. ఇటు అభిమానులు ఈ గ్యాప్ లో మరో సినిమా చేయమని రోజురోజుకి ఒత్తిడి పెంచేస్తున్నారు. బాహుబలి పార్ట్ 2 2017 కి కానీ విడుదలకు సిద్దం అయ్యే విధంగా కనపడటం లేదు. ఇప్పుడు ఉన్న పోటీలో ఈ విధంగా రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే ఎలా అని అభిమానులు, శ్రేయోభిలాషులు గట్టిగా ప్రభాస్ కి క్లాస్ పీకుతున్నారట. ప్రభాస్ కూడా అభిమానుల చెప్పిన మాటను పట్టించుకోని బాహుబలి 2 షెడ్యుల్ గురించి రాజమౌళితో గట్టిగా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాడట. అక్టోబర్ 10న రాజమౌళి తన పుట్టినరోజు వేడుకలను బాహుబలి టీం మధ్య జరుపుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో ఈ విషయం మీద ఒక క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.

No comments:

Item Reviewed: ప్రభాస్ ఒత్తిడికి గురి అవుతున్నాడా? Rating: 5 Reviewed By: TeluguPeople Adda