Trending
Thursday, 1 October 2015

మెగా వారసురాలికి పారితోషికం అంతా.....???



ఇప్పటివరకు సినీ పరిశ్రమకు మెగా ఫ్యామిలీ నుండి హీరోలు మాత్రమే ఎంట్రీ
ఇచ్చారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్దం అయ్యింది. ఇమే నాగబాబు కూతురు నిహారిక. ఇమే సినిమా ఎంట్రీ ఇవ్వకుండానే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఏమి చేసిందని ఆలోచనలో పడ్డారా? ఏమి లేదండి. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకి 30 లక్షలకు పైగా  రెమ్యునేషన్ తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.
మొదటి సినిమా ప్రారంభం కాకుండానే రెండో సినిమాకి కూడా సైన్ పెట్టేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మెగా వారసురాలు పారితోషికం విషయంలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రెండు,మూడు సినిమాలు చేసిన అప్ కమింగ్ హీరోలు తీసుకొనే పారితోషికాన్ని మొదటి సినిమాకే అందుకుంటుంది నిహారిక.
నాగ బాబు కూతురు కావటం, ఈ సినిమాకి మెగా హీరోలందరి సహకారం ఉండటం,ఇప్పటికే టీవి షో ల ద్వారా బుల్లి తెర అభిమానులను సంపాదించుకోవటం వంటి క్రేజ్ నిహారికకు ఉండటంతో నిర్మాతలు నిహారిక కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాక నిహారిక తమ సినిమాకి ప్లస్ అవుతుందని ఉద్దేశంతో ఇంత భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వటానికి నిర్మాతలు వెనకడుగు వేయలేదు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా నటిస్తుంది.

No comments:

Item Reviewed: మెగా వారసురాలికి పారితోషికం అంతా.....??? Rating: 5 Reviewed By: TeluguPeople Adda