Trending
Saturday, 10 October 2015

‘ఖుషీ’ కి సీక్వెల్‌ వస్తుందా?

‘ఖుషీ’ కి సీక్వెల్‌ వస్తుందా?

దర్శకుడు ఎస్‌. జె సూర్య ‘ఖుషీ’ కి సీక్వెల్‌ తీయటానికి రెడీ అవుతున్నాడు. తెలుగులో ఈ సినిమా పవన్ కి మంచి పేరును తీసుకురావటంతో పాటు సక్సెస్ కి బాట వేసింది. అయితే ముందుగా ఈ సినిమాని సూర్య తమిళంలో విజయ్ తో చేసి అక్కడ హిట్ అయ్యాక తెలుగులో పవన్ తో చేసాడు. ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత సూర్య చాలా సినిమాలకు దర్శకత్వం వహించిన సరైన హిట్ కొట్టలేకపోయాడు. ఈ సీక్వెల్ లో కూడా విజయ్ నే తీసుకుంటున్నాడు సూర్య. ప్రస్తుతం విజయ్ ‘రాజా-రాణి’ దర్శకుడు అట్లీతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత 'ఖుషీ’  సీక్వెల్‌ సెట్స్ మీదకు వెళ్ళుతుందని సమాచారం. హీరోయిన్ గా నయనతార ను ఎంపిక చేసారు. ఈ సినిమా కనుక తమిళంలో విజయం సాదిస్తే తెలుగులో కూడా సీక్వెల్ తీయటానికి రెడిగానే ఉన్నాడు సూర్య. సూర్య ఇప్పటికి పవన్ తో సన్నిహిత సంబందాలను కొనసాగిస్తున్నాడు. దాంతో ' ఖుషీ’ సీక్వెల్‌ తెలుగులో కూడా సాధ్యమే అని టాక్.

No comments:

Item Reviewed: ‘ఖుషీ’ కి సీక్వెల్‌ వస్తుందా? Rating: 5 Reviewed By: TeluguPeople Adda