Trending
Friday, 2 October 2015

కృష్ణ వంశీ ట్రెండ్ మారుస్తున్నాడా?


ప్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కృష్ణ వంశీ ' గోవిందుడు అందరివాడేలే' సినిమా తర్వాత ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు. ప్రస్తుతం నడుస్తున్న హర్రర్ కామెడీ ట్రెండ్ కి కృష్ణ వంశీ  షిఫ్ట్ అవుతున్నాడని సమాచారం. కామెడి హర్రర్ బేస్ తో ఒక కథను సెట్ చేసి దిల్ రాజుకి విన్పించాడు. దిల్ రాజు కి కథ నచ్చటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ఈ సినిమా లేడి ఓరియంటెడ్ సినిమా కావటంతో 'రుద్రాక్ష' అనే పేరు పెట్టె ఆలోచనలో ఉన్నారట.

ఈ జోనర్ లో సినిమాలు తీసి ఆల్రెడీ హిట్ కొట్టేసారు మన దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతా అయితే బాగుంటుందని దిల్ రాజు భావిస్తున్నాడట. అయితే సమంతా ఇటువంటి బిన్నమైన కథకు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఆల్రెడీ నయనతార,త్రిష ఈ టైప్ సినిమాలు చేసి సక్సెస్ కొట్టారు. కాకపోతే రొటీన్ కి బిన్నంగా చేయాలనీ సమంతా భావిస్తే మాత్రం ఈ టైపు జోనర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సాదారణంగా కృష్ణ వంశీ తను చేసే ప్రతి సినిమాకి  ఫుల్ పోకస్ ని పెట్టటమే కాకా తన మార్కును చూపిస్తాడు. మరి ఈ హారర్ థ్రిల్లర్ సినిమా మీద తన మార్క్ ను ఎలా పెడతాడో చూడాలి.

No comments:

Item Reviewed: కృష్ణ వంశీ ట్రెండ్ మారుస్తున్నాడా? Rating: 5 Reviewed By: TeluguPeople Adda