Trending
Saturday, 10 October 2015

నిహారిక ఎంట్రీ గురించి మెగా అభిమానులు అసంతృప్తి.....???


మెగా బ్రదర్ కూతురు మెగా డాటర్ ఎంట్రీ దాదాపుగా ఖాయం అయ్యిపోయింది. ఈ నెల 30 వ తారీఖున మొదలు అవుతుందని సమాచారం. ‘ఒక మనసు’ అనే టైటిల్ తో నిర్మిస్తున్న ఈసినిమా ప్రారంభాన్ని  చాలా ఘనంగా చేయాలని నాగబాబు ఆలోచిస్తున్నట్లు టాక్. ఈ వేడుకలో మెగా హీరోలందరూ వచ్చేలా తన వంతు ప్రయత్నాలను మొదలు పెట్టాడు నాగబాబు. అయితే పవన్ విషయంలో క్లారిటీ లేదు. అయితే నిహారిక అంటే పవన్ ఇష్టం కాబట్టి వస్తాడని అనుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా మరోవైపు మెగా అభిమానులు నిహారిక సినిమాలోకి ఎంట్రీ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నారట. కొంత మంది అభిమానులు నాగబాబు దగ్గరకు వెళ్లి నిహరికను సినిమాల్లో నటించటానికి ఒప్పుకోవద్దని చెప్పుతూ అప్పట్లో కృష్ణ కూతురు మంజుల సినిమాల్లోకి వస్తాను అన్నప్పుడు అభిమానులు అభ్యంతరం చెప్పటాన్ని గుర్తు చేసారట. అయితే నాగబాబు అప్పటి రోజులు ఇప్పటి రోజులు వేరు అని చెప్పి, నిహారిక హుందాగా ఉన్న పాత్రలను మాత్రమే చేస్తుందని చెప్పాడట.

No comments:

Item Reviewed: నిహారిక ఎంట్రీ గురించి మెగా అభిమానులు అసంతృప్తి.....??? Rating: 5 Reviewed By: TeluguPeople Adda