Trending
Tuesday, 20 October 2015

'బ్రూస్ లీ' తర్వాత విడిపోతున్నారా?


'బ్రూస్ లీ ' సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 16న విడుదల అవుతుంది. అప్పుడే బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యిపోయాయి. శ్రీను వైట్ల సినిమా అంటే ఫుల్ కామెడి సినిమాగా చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. అలాగే చిరు ఈ సినిమాలో నాలుగు నిముషాలు మెరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీను వైట్ల ఈ విధంగా సక్సెస్ కావటం వెనక ఇద్దరు ఉన్నారు. వారే రచయతలు కోనవెంకట్, గోపి మోహన్ లు. వీరు కష్టపడి కథ,స్క్రీన్ ప్లే రాస్తే శ్రీను వైట్ల చక్కగా డైరెక్షన్ చేసేవాడు. వీరి యాత్ర 'బాద్ షా' తో ఆగిపోయింది. ఆ తర్వాత శ్రీను వైట్ల తీసిన 'ఆగడు' ఎంతటి పరాజయాన్ని ఇచ్చిందో తెలిసిందే. ఇప్పుడు 'బ్రూస్ లీ' సినిమా కోసం రామ్ చరణ్ ఈ ముగ్గురిని కలిపాడు. అయితే వీరి ప్రయాణం 'బ్రూస్ లీ' తర్వాత కూడా కొనసాగుతుందా? అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే 'బ్రూస్ లీ' సినిమా తర్వాత శ్రీను వైట్ల,కోన వెంకట్ చెరో దారి చూసుకుంటారని సమాచారం. ఇప్పటికే శ్రీను వైట్ల రచయతల కోసం వేట మొదలు పెట్టాడు.

No comments:

Item Reviewed: 'బ్రూస్ లీ' తర్వాత విడిపోతున్నారా? Rating: 5 Reviewed By: TeluguPeople Adda