Trending
Wednesday, 7 October 2015

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన నాని


ప్రతి హీరోకి మణిరత్నం సినిమాలో నటించాలని కోరిక ఉండటం సహజమే. అయితే ఆ కోరిక కొంతమందికి నెరవేరుతుంది. మరి కొంతమందికి అది కలగా మిగిలిపోతుంది. మణిరత్నం తన సినిమాల్లో హీరోలను ఎంపిక చేసే విధానం ఒకటి ఉంది. అయన కథ ఎవరిని డిమాండ్ చేస్తే వారిని మాత్రమే ఎంపిక చేసుకుంటాడు. అంతేకాని స్టార్ డమ్ ని ఏ మాత్రం దృష్టిలో పెట్టుకోదు. అందుకే స్టార్ హీరోలు సైతం మణి సినిమాలో నటించటానికి రెడీగా ఉంటారు.

టాలీవుడ్ లో నటనను నేచురల్ గా చేస్తాడని పేరు తెచ్చుకున్న నాని ఈగ సినిమా ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గర అయ్యాడు. మణిరత్నం తెరకెక్కించిన  'ఓకె బంగారం' సినిమా తెలుగు వెర్షన్ కి నాని డబ్బింగ్ చెప్పాడు. ఆ సమయంలో మణికి నాని బాగా నచ్చడంతో తన తర్వాత ప్రాజెక్ట్ లో అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, కార్తీ హీరోలుగా రీవేంజ్ డ్రామాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న మణిరత్నం ఈ సినిమాని తెలుగు,తమిళం రెండు బాషల్లోను తీస్తున్నాడు. అయితే తెలుగు వెర్షన్ లో ఒక హీరోగా నానిని తీసుకుంటున్నాడా? లేదా ఒక ముఖ్యమైన పాత్రకు తీసుకుంటున్నాడా? అనే విషయం మీద క్లారిటీ రావాలి.

No comments:

Item Reviewed: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన నాని Rating: 5 Reviewed By: TeluguPeople Adda