Trending
Wednesday, 21 October 2015

చిరుని ఎందుకు రివీల్ చేయలేదు

చిరుని ఎందుకు రివీల్ చేయలేదు

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోకి వెళ్ళాక తొలిసారిగా ముఖానికి రంగేసుకున్న సినిమా 'బ్రూస్ లీ'. ఈ సినిమాలో చిరు నటించటానికి దర్శకుడే కారణమని అందరూ ఇప్పటివరకు భావించారు. అయితే ఈ సినిమాలో నటిస్తానని చిరంజీవి స్వయంగా ముందుకు వచ్చారట. ఈ సినిమాలో చిరు దాదాపుగా నాలుగు నిముషాలు కనువిందు చేయనున్నాడు. సినిమా హైప్ కోసం చిరు తో ఒక ట్రైలర్ రెడీ చేసారు. కానీ ఆఖరు నిమిషంలో రిలీజ్ చేయటం ఆపేసారు. ఈ ట్రైలర్ చూసి ఎక్కువ అంచనాలతో ప్రేక్షకుడు దియేటర్ కి వస్తే, వారు అనుకున్న దానికి తక్కువగా అన్పిస్తే సినిమా ఫట్ అయ్యే ప్రమాదం ఉందని చిరు ని రివీల్ చేయటం మానేసారు. ఇప్పటికే 'బ్రూస్ లీ' టేబుల్ ప్రాఫిట్ తో ఉంది. 2000 స్క్రీన్స్ కి పైగా “బ్రూస్ లీ” మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. మొదటి రోజే భారీగా కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు.

No comments:

Item Reviewed: చిరుని ఎందుకు రివీల్ చేయలేదు Rating: 5 Reviewed By: TeluguPeople Adda