Trending
Friday, 2 October 2015

చిరు 'కత్తి' తో దూసుకు వస్తాడా?



చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిరు 150 వ సినిమా గురించి రోజు ఏవో ఒక వార్తలు హాల్ చల్ చేస్తూ ఆ సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి. అభిమానుల ఆశలు నెరవేరే సమయం వచ్చిందని ఫిల్మ్ నగర్ లో అంటున్నారు. తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన 'కత్తి' సినిమా రీమేక్ లో నటించాలని చిరు భావిస్తున్నాడు. ఈ సినిమాలో మార్పులు చేర్పుల గురించి మాస్ డైరెక్టర్ వినాయక్ తో చర్చిస్తున్నాడని సమాచారం. మొన్నటివరకు చిరు 150 వ సినిమాకి పూరీ దర్శకత్వం వహిస్తాడని ప్రచారం జరిగింది.

పూరీ చెప్పిన కథలో రెండో బాగం చిరుకి నచ్చకపోవటంతో ఆ ప్లేస్ లోకి వినాయక్  వచ్చి చేరాడు. గతంలో చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా కూడా తమిళ రీమేక్. ఈ సినిమని కూడా  వినాయక్ దర్శకత్వం వహించాడు. ఠాగూర్ తమిళ మాతృకకు కథను మురుగదాస్ అందించాడు.  ఇప్పుడు చిరు చేస్తున్న 'కత్తి' సినిమాను  తమిళంలో మురుగదాస్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు కూడా అదే కాంబినేషన్ రిపీట్ అవుతుందని సమాచారం. ఠాగూర్ సినిమా తర్వాత చిరు,వినాయక్, మురుగదాస్ కాంబినేషన్ లో 'కత్తి' సినిమా రానున్నది. ఈ సినిమా నవంబర్ లో ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'బ్రూస్లీ' సినిమా ఆడియో వేడుకలో చిరు 150 వ సినిమా  ప్రకటించాలని చెర్రీ ప్లాన్ చేశాడట.

No comments:

Item Reviewed: చిరు 'కత్తి' తో దూసుకు వస్తాడా? Rating: 5 Reviewed By: TeluguPeople Adda