Trending
Tuesday, 20 October 2015

'బహుబలి 2' కీలక నిర్ణయం....ఏమిటి?

'బహుబలి 2' కీలక నిర్ణయం....ఏమిటి?

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన 'బాహుబలి' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాదించటమే కాకా ఎన్నో రికార్డ్స్ ని తిరగ రాసింది. దాంతో 'బాహుబలి 2' పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. అందుకే కథ మీద బాగా కసరత్తు చేసారు. ఇప్పుడు లోకేషన్స్ వేటలో పడ్డారని సమాచారం. ఈ సారి 'బాహుబలి 2' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి ఎలా విడుదల అవుతాయో నిర్మాతలు బాగా తెలుసుకున్నారు. ఈ సినిమాను దాదపుగా ఒకేసారి 8 బాషల్లో విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. అలాగే బాహుబలి మొదటి పార్ట్ లో ప్రేక్షకులు ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు అంటే ఇష్టపడటంతో 'బాహుబలి 2' లో మార్పులు చేసారు. 'బాహుబలి 2' లో టాకీ పార్ట్ తగ్గించి యాక్షన్ సన్నివేశాలను పెంచే విధంగా కథను సెట్ చేసారు. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ ని చాలా అద్భుతంగా రాసాడని చిత్ర యూనిట్ అంటోంది.

No comments:

Item Reviewed: 'బహుబలి 2' కీలక నిర్ణయం....ఏమిటి? Rating: 5 Reviewed By: TeluguPeople Adda