Trending
Wednesday, 21 October 2015

గోన గన్నారెడ్డి వెనక ఎవరు ఉన్నారు


'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర సినిమాకి ఎంత హైప్ ని తీసుకువచ్చిందో మనం చూసాం కదా. ఇప్పటివరకు మనం అందరం ఈ పాత్ర కోసం బన్ని ఎంత కష్టపడ్డాదో అని అనుకున్నాం. ఈ కష్టం వెనక మరొకరు ఉన్నారట. ఎవరా అని ఆలోచిస్తున్నారా? మరి ఎవరో కాదండి. బన్ని సతీమణి స్నేహ రెడ్డి దగ్గర ఉండి మరీ బన్ని చేత ఈ హార్డ్ వర్క్ చేయించిందట. బన్నికి స్నేహరెడ్డి సాయం లేకపోతే ఈ పాత్ర అంత హైప్ వచ్చేది కాదని అల్లు అర్జున్ సన్నిహితులు చెప్పుతున్నారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తెలంగాణా యాసను కూడా బాగా ప్రాక్టిస్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ యాసను ప్రాక్టీస్ చేసే విషయంలో బన్నీ తనభార్య స్నేహారెడ్డి సాయం బాగా తీసుకున్నాడట. ఆమెకు ఈ యాసపై మంచి పట్టు ఉండటంతో కొన్ని డైలాగ్స్ ఎలా పలకాలో కొన్ని సూచనలను చేసిందట. ఆ డైలాగ్స్ 'రుద్రమదేవి' సినిమాకు హైలెట్ అయినాయి. అంతేకాక అరవింద్ ఈ పాత్ర చిరంజీవి తప్ప ఎవరు అంత బాగా చేయలేరని అన్నాడట. దాంతో బన్ని ఇంకా పట్టుదలగా ఈ పాత్రను చేసి అందరిని మెప్పించాడు.

No comments:

Item Reviewed: గోన గన్నారెడ్డి వెనక ఎవరు ఉన్నారు Rating: 5 Reviewed By: TeluguPeople Adda