Trending
Thursday, 1 October 2015

అక్కినేని అభిమానులకు సర్‌ప్రైజ్....???


అక్కినేని మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న 'అఖిల్' సినిమాలో రోజుకోక ఎట్రాక్షన్ జత చేస్తూ అభిమానుల్లో అంచనాలను పెంచుతున్నారు. సినిమాకి క్రేజ్ ని పెంచటానికి తన వంతు ప్రయత్నాలను నాగార్జున శక్తి వంచన లేకుండా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో నాగార్జున గెస్ట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగ చైతన్య కూడా గెస్ట్ రోల్ పోషిస్తున్నాడని సమాచారం. అఖిల్ ఇంట్రడక్షన్ సాంగ్ లో అఖిల్ తో కలిసి నాగార్జున,నాగ చైతన్య స్టెప్స్ వేయనున్నారు.

నాగార్జున అఖిల్ సినిమాకి మంచి క్రేజ్ తీసుకురావటానికి  బయట నుంచే కాకుండా సినిమాలో నటించి కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ పాటకు సంబందించిన సీన్స్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో జరుగుతుంది. వీరు ముగ్గురు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవటం అక్కినేని అభిమానులకు పెద్ద  సర్‌ప్రైజ్. నాగార్జున అఖిల్ ని మాస్ హీరోగా ఎలివేట్ చేయటానికి మాస్ డైరెక్టర్ వినాయక్ చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దసరా కానుకగా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

No comments:

Item Reviewed: అక్కినేని అభిమానులకు సర్‌ప్రైజ్....??? Rating: 5 Reviewed By: TeluguPeople Adda