Trending
Tuesday, 8 September 2015

ఆ సినిమా హక్కుల కోసం కొట్టుకుంటున్న తెలుగు ప్రొడ్యూసర్ లు ::


ఇద్దరు తెలుగు ప్రొడ్యూసర్ ల వర్గాలు ఒక సినిమా హక్కుల కోసం కొట్టుకుంటున్నాయి, ఆ సినిమా తమిళం లో విడుదల అయిన తని ఒరువన్.  జయం రవి హీరోగా మోహన్ రాజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం తమిళ బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ లో నటించేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఆసక్తి చూపుతున్నారని టాక్ మరి. ఈ సినిమా హక్కుల కోసం దిల్ రాజు ఒక వర్గం గా డీవీవీ దానయ్య - ఎల్వీ ప్రసాదు లో ఒక వర్గంగా పోటీ పడుతున్నారు. డీవీవీ కి  ఈ సినిమా రాం చరణ్ తో చెయ్యాలని ఉండగా, మహేష్ బాబు తో తీయాలని దిల్ రాజు ప్లాన్ గా తెలుస్తోంది. మొత్తానికి హక్కులు ఎవరికీ వెళతాయో తెలీదు కానీ ఇప్పటి వరకూ రీమేక్ ల జోలికి వెళ్ళని మహేష్ బాబు  రాం చరణ్ లని కూడా ఈ ట్రాక్ లోకి లాగే పనిలో బిజీ గా ఉన్నారు ప్రొడ్యూసర్ లు. 

No comments:

Item Reviewed: ఆ సినిమా హక్కుల కోసం కొట్టుకుంటున్న తెలుగు ప్రొడ్యూసర్ లు :: Rating: 5 Reviewed By: TeluguPeople Adda