Trending
Tuesday, 8 September 2015

అప్పుడే తదుపరి సినిమా మొదలు పెట్టేసిన మెగా హీరో ::


మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. కెరీర్ ప్రారంభంలో కాస్త స్లోగా అనిపించినా ఇప్పుడు సాయిధరమ్ తేజ్ సినిమాల షూటింగ్ విషయంలో జోరు పెంచాడు. వరుసగా కొంతమంది క్రేజీ డైరెక్టర్స్ సినిమాలకు సైన్ చేస్తూ ఒక్కోదాన్ని వరుసగా సెట్స్ పైకి తీసుకెళ్ళి శరవేగంగా సినిమా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేసిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని సెప్టెంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. సుబ్రమణ్యం ఫర్ సేల్ షూటింగ్ చివరి స్టేజ్ లో ఉండగానే తన తదుపరి సినిమా ‘తిక్క’ని లాంచ్ చేసాడు.
లాంచ్ చేయడమే కాదు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాకి గుమ్మడి కాయ కొట్టగానే ‘తిక్క’ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళి శరవేగంగా షూటింగ్ కూడా చేసేస్తున్నాడు. ‘ఓం’ ఫేం సునీల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ హైవే రోడ్ లో జరుగుతోంది. అక్కడ సాయిధరమ్ తేజ్ పై ఒక చేజింగ్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వరకూ అక్కడే షూట్ చేసి ఆ తర్వాత హైదరాబాద్ లోని మరో లొకేషన్ కి ఈ సినిమాని షిఫ్ట్ చేయనున్నారు. ‘హ్యాండిల్ విత్ కేర్’ అనే ట్యాగ్ లైన్ తో రానున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన లారిస్స బోనేసి హీరోయిన్ గా కనిపించనుంది. సి. రోహిన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించనున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి – దిల్ రాజు కాంబినేషన్ లో చేయనున్న ఓ సినిమాకి కూడా సాయి ధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

No comments:

Item Reviewed: అప్పుడే తదుపరి సినిమా మొదలు పెట్టేసిన మెగా హీరో :: Rating: 5 Reviewed By: TeluguPeople Adda