Trending
Tuesday, 8 September 2015

ప్రకాష్ రాజ్ ఇప్పుడు 'శ్రీమంతుడు '


విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒక గొప్ప ఉన్నతమైన పని చేసి అందరి ప్రశంసలూ పొందుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్రామాలను దత్తత తీసుకొని బాగుపరచడమనే ఒక ఆలోచనను సమర్ధవంతంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యాన్నే ప్రధానాంశంగా తీసుకొని సూపర్ స్టార్ మహేష్ చేసిన శ్రీమంతుడు సినిమాతో ఊరిని దత్తత తీసుకోవడమనే కాన్సెప్ట్ తెలుగు నాట బలంగా నాటుకుపోయింది. సినిమాలో చేసినట్లుగానే బయటకూడా మహేష్, ఊరిని దత్తత తీసుకున్నాక తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కూడా తాజాగా ఈ లిస్ట్‌లో చేరిపోయారు.తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ జ్యోతి కార్యక్రమం లో ప్రకాష్ రాజ్ జేరి కొండ్రెడ్డి పల్లె అనే ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు , ఈ విషయం స్వయంగా కేటీఆర్ విశేషం. కేటీఆర్ ని కలిసిన ప్రకాష్ రాజ్ తన ఉద్దేశ్యం చెప్పినట్టు తనకి కూడా సంతోషం వేసినట్టు తెలంగాణా మంత్రి తెలిపారు. 

No comments:

Item Reviewed: ప్రకాష్ రాజ్ ఇప్పుడు 'శ్రీమంతుడు ' Rating: 5 Reviewed By: TeluguPeople Adda