Trending
Saturday, 22 August 2015

100 రోజుల లయన్


బాలకృష్ణ కెరియర్లో 'లెజెండ్' చెప్పుకోదగిన విజయాన్ని సాధించగా .. ఆ తరువాత వచ్చిన 'లయన్' కూడా విజయపతాకాన్ని ఎగురవేసింది. రుద్రపాటి రమణారావు నిర్మాణంలో సత్యదేవ తెరకెక్కించిన ఈ సినిమా 100 రోజులు ఆడేసింది. బాలకృష్ణ సరసన కథానాయికలుగా త్రిష - రాధిక ఆప్టే అలరించిన ఈ సినిమా, చిలకలూరి పేటలోని రామకృష్ణ - ఏసీ థియేటర్ లో రోజుకి నాలుగు ఆటల చొప్పున 100 రోజులు ఆడింది. అదే విధంగా ఆదోనిలోని సత్యం ఏసీ డీటీఎస్ లోను ఈ సినిమా 100 రోజులు ప్రదర్శించబడింది. బలమైన కథా కథాలను భారీ బడ్జెట్ తో తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను అలరించింది. బాలకృష్ణ సినిమా నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలను ఇందులో సమపాళ్లలో మేళవించడం కూడా ఈ సినిమా 100 రోజుల మైలురాయిని చేరుకోవడానికి ప్రధాన కారణమైందని చెప్పుకోవచ్చు. 

No comments:

Item Reviewed: 100 రోజుల లయన్ Rating: 5 Reviewed By: TeluguPeople Adda