Trending
Saturday, 22 August 2015

కడియం - ఎర్రబెల్లి కొత్త వివాదం

కడియం - ఎర్రబెల్లి కొత్త వివాదం


ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే కడియం, ఎర్రబెల్లి మధ్య మరోసారి వివాదం తలెత్తింది. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ ఎర్రబెల్లి నిలయదీయడంతో కార్యక్రమం రసాభాసగా మారింది. టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో కాసేపు ఉద్రికత్త ఏర్పడింది..కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్..ఇద్దరూ వరంగల్ జిల్లా నేతలే. ఒకే పార్టీ నుంచి రాజకీయంగా ఎదిగారు. ఒకప్పుడు మంచి స్నేహితులు . కాబినెట్ సహచరులుగా కలిని పనిచేశారు కూడా. కానీ కడియం పార్టీ మారిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఈ ఇద్దరికీ ఇప్పుడు క్షణం కూడా పడటం లేదు. జిల్లాలో  జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ఇద్దరూ హాజరయ్యారంటే కచ్చితంగా అక్కడ ఎదో ఓ వివాదం జరుగుతూనే ఉంది.తాజాగా వరంగల్ జిల్లా తొర్రూరులో జరిగిన మార్కెట్ యార్డ్ గోదాం శంకుస్థాపన కార్యక్రమం ఇద్దరి మధ్య విభేదాలకు మరోసారి కారణమైంది. శంకుస్థాపన పలకంపై ముద్రించిన పేర్ల విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని నిలదీశారు ఎర్రబెల్లి. ఇది కాస్త గొడవగా మారి గందరగోళానికి దారితీసింది. అక్కడే ఉన్న టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. ఒకరినొకరు తోసుకున్నారు . హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చడం లేదంటూ కడియంపై ఫైరయ్యారు ఎర్రబెల్లి. తన నియోజకవర్గానికి రానాల్సిన నిధులను అడ్డుకున్న కడియం అంతుచూస్తానంటూ హెచ్చరించారు.
కడియం, ఎర్రబెల్లి మధ్య వివాదాలు కొత్తకాదు. గతంలోనూ పలుమార్లు ఇద్దరూ బహిరంగంగానే గొడవపడ్డారు. ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శించుకున్నారు. మొత్తానికి కడియం, ఎర్రబెల్లి వస్తున్నారంటే అందరికంటే ఎక్కువగా జిల్లా పోలీసుల్లో టెన్షన్ మొదలవుతోంది. ఏక్షణం ఏగొడవ జరుగుతుందో తెలియక తలలుపట్టుకుంటున్నారు ఖాకీలు..

No comments:

Item Reviewed: కడియం - ఎర్రబెల్లి కొత్త వివాదం Rating: 5 Reviewed By: TeluguPeople Adda