Trending
Saturday, 22 August 2015

'సంతోషం'లో జ్యోతిలక్ష్మి


ఐటమ్ సాంగ్స్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేర్లు జయమాలిని, జ్యోతిలక్ష్మి. ఒకప్పుడు ఈ ఇద్దరూ తమ డ్యాన్సులతో వెండితెరను కనువిందు చేశారు. అసలు ఈ ఇద్దరూ ఇప్పుడెలా ఉన్నారు? అంటే.. జయమాలిని ఎలా ఉన్నారో గత ఏడాది 'సంతోషం' అవార్డ్స్ వేడుకలో చూశాం. దాదాపు పాతికేళ్ల తర్వాత ఆమె తెలుగు ప్రేక్షకులకు కనిపించడంతో ఆ వేడుకకే 'సెంటరాఫ్ ఎట్రాక్షన్' అయ్యారు. ఇప్పుడు ఈ ఏడాది 'సంతోషం' అవార్డ్స్ వేడుకకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ హాలులో జరగనున్న 'సంతోషం' అవార్డ్స్ వేడుకలో జ్యోతిలక్ష్మి పాల్గొననున్నారు. ఇక చెప్పడానికి ఏముంటుంది? ఈ ఏడాది వేడుక కూడా సూపర్ డూపర్ హిట్టే. గత ఏడాది జయమాలిని వేదిక పై చిన్న చిన్న స్టెప్పులు కూడా వేశారు. మరి.. జ్యోతిలక్ష్మి కూడా కాలు కదుపుతారా?... ఆ విషయాన్ని అవార్డ్స్ వేడుకలో తెలుసుకుందాం.

No comments:

Item Reviewed: 'సంతోషం'లో జ్యోతిలక్ష్మి Rating: 5 Reviewed By: TeluguPeople Adda