Trending
Saturday, 22 August 2015

ఈ నెల ఇరవై ఐదు న భేటీ కానున్న బాబు - మోడీ



ప్రధాని నరేంద్రమోడీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లేక ప్యాకేజా అని తేల్చే  కీలక సమావేశంగా దీన్ని పరిగణిస్తున్నారు. వాస్తవానికి గత గురువారమే జరగాల్సిన ఈ భేటీ వాయిదా పడింది. తదుపరి సమావేశం కోసం ఈనెల 25 నుంచి 31వ తేదీల్లో ఏదో ఒక రోజు ఢిల్లీకి రావచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ సీఎం కార్యాలయానికి సమాచారమిచ్చింది.
స్పెషల్ స్టేటస్ పై ఇప్పటికే ఒత్తిడి పెరుగుతండటంతో ఈనెల 25నే భేటీ అయ్యేందుకు చంద్రబాబు మొగ్గు చూపారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎలాగైనా ఒప్పించాలన్న లక్ష్యంతో చంద్రబాబు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. . బీహార్ తరహా ప్యాకేజీ కాకుండా ఉత్తరాఖండ్ మాదిరిగా ప్రత్యేక హోదా, ప్యాకేజీపై పట్టుబట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అసలు స్పెషల్ స్టేటస్ ఎందుకు అవసరమో పేర్కొంటూ ఇప్పటికే సమగ్ర నివేదికను కూడా  సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.. మొత్తానికి స్పెషల్ స్టేటస్ తోపాటు లక్షా 50 వేల కోట్ల భారీ ప్యాకేజీకి డిమాండ్ చేయాలని లెక్కలు వేసినట్లు తెలుస్తోంది..అటు రాజధాని నిర్మామం కోసం కూడా స్పెషల్ ఫండ్స్ ను అడగాలని బాబు యోచిస్తున్నారు. ఇటు కేంద్రం కూడా ఏపీ అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే  రెడీ చేసిన నివేదిక ప్రధాని కార్యాలయానికి చేరినట్లు సమాచారం. మొత్తానికి ఈనెల 25న జరిగే భేటీతో ఏపీ స్టేటస్ పై  ఓ స్పష్టత రానుంది.

No comments:

Item Reviewed: ఈ నెల ఇరవై ఐదు న భేటీ కానున్న బాబు - మోడీ Rating: 5 Reviewed By: TeluguPeople Adda