Trending
Thursday, 20 August 2015

శ్రీమంతుడు థాంక్స్ చేబుతాడట






శ్రీమంతుడు థాంక్స్ చేబుతాడట

శ్రీమంతుడు సినిమా ని అంత పెద్ద హిట్ చేసినందుకు గాను ఒక స్పెషల్ థాంక్స్ మీట్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నాడు మహేష్ బాబు , ఈ సినిమా కి హీరో గానే కాక కో ప్రొడ్యూసర్ గా కూడా ఉండి అన్నీ చూసుకున్న మహేష్ బాబు కలక్షన్ ల విషయం లో చాలా హ్యాపీగా ఉన్నాడు. వరల్డ్ వైడ్ కలక్షన్ ని ఇప్పట్లో ఏ సినిమా చేరుకోలేని రేంజ్ లో మహేష్ శ్రీమంతుడు పెరిగిపోయింది అనడం అతిశయోక్తి కాదేమో. ఆ రేంజ్ లో ప్రమోషన్ తో పాటు స్టామినా కూడా ఉన్న సినిమా గా శ్రీమంతుడు రికార్డులు తిరగ రాస్తోంది. గ్రాండ్ సక్సెస్ కి ప్రేక్షకులకి కృతజ్ఞత చెప్పడం కోసం ఈ నెల ఇరవై న శిల్పా రామం లో థాంక్స్ మీట్ ని ఏర్పాటు చేసాడు. మొత్తం సినిమా తారాగణం మొత్తం అక్కడ కనిపిస్తారు వారితో పాటు దర్శకుడు కొరటాల శివ , దేవీ శ్రీ ప్రసాద్ లు కూడా రానున్నారు.







No comments:

Item Reviewed: శ్రీమంతుడు థాంక్స్ చేబుతాడట Rating: 5 Reviewed By: TeluguPeople Adda