Trending
Saturday, 22 August 2015

పాటల విడుదల సన్నాహాల్లో భీమవరం టాకీస్ "ఎఫైర్"


భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం "ఎఫైర్". "ఇద్దరమ్మాయిల ప్రేమకథ"గా ప్రాచుర్యం పొందిన ఈ చిత్రం పాటలు త్వరలో విడుదల చేయనున్నారు. శ్రీరాజన్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంతి, గీతాంజలి, ధనరాజ్, రాకేష్, సాయిరాజ్, షాని సాల్మోన్, ముఖ్యపాత్రధారులు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకొని సెన్సార్ కి సిద్ధమైన ఈ చిత్రం గురించి భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... "బాలీవుడ్ లో మహేష్ భట్  ఏక్తాకపూర్ వంటివారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసే బోల్డ్ సినిమాల నుంచి పొందిన స్ఫూర్తితో రూపొందిస్తున్న సినిమా "ఎఫైర్". ఈ సినిమా ఫస్ట్ లుక్ కు బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ గా శ్రీరాజన్ కి చాలా ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. బిజినెస్ పరంగా ఇప్పటికే చాలా మంచి క్రేజ్ తెచ్చుకొన్న ఈ చిత్రం ఆడియోను అతి త్వరలో విడుదల చేసి, వీలైనంత త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
పుచ్చా రామకృష్ణ, హరిణి, ఫణి, సంపత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: సోమేశ్వర్ పోచం, కెమెరా: కర్ణ ప్యారసాని, డైలాగ్స్: అనిల్, మ్యూజిక్: శేషు కె.ఎం.అర్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజన్! !

No comments:

Item Reviewed: పాటల విడుదల సన్నాహాల్లో భీమవరం టాకీస్ "ఎఫైర్" Rating: 5 Reviewed By: TeluguPeople Adda