Trending
Wednesday, 26 August 2015

రవితేజ మీద పిచ్చ కోపంగా ఉన్న బాలకృష్ణ :మాస్ రాజా రవితేజ కిక్-2 మూవీలో పదే పదే చెప్పిన ఒక డైలాగ్ విషయంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారంనాడు విడుదలైన ఈ చిత్రంలో ఒక విలన్-ను ఉద్దేశించి రవితేజ మాటి మాటికి ‘బాలిగా’ అని పిలుస్తుండడం బాలయ ఫ్యాన్స్-కు ఏమాత్రం ఇష్టంలేదు. ఆ డైలాగ్ తమ అభిమాన హీరో బాలకృష్ణను కించపరిచే విధంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిక్ -2 సినిమాలోని విలన్ పేరు ‘బలరాం’. అయితే వెటకారం ధ్వనించేలా ఉండే రవితేజ డైలాగ్ మాడ్యలేషన్-లో బాలిగా అంటూ ఉంటాడు. ఇంతకు ముందు బలుపు సినిమాలో కూడా రవితేజ ఒక సీన్-లో బాలకృష్ణ డైలాగులకు కామెడీ జోడించి చెప్పడం కూడా బాలయ్య ఫ్యాన్స్-కు నచ్చలేదు. కిక్ -2 సినిమాను నిర్మించిన నందమూరి కళ్యాణ్ రామ్ అయినా ‘బాలిగా’ డైలాగ్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉండాల్సిందని వారు అంటున్నారు. అయితే ఈ సినిమాలోని ‘బాలిగా’ డైలాగ్-కు, బాలకృష్ణకు ఎలాంటి సంబంధం లేదని అనడం గమనార్హం.

No comments:

Item Reviewed: రవితేజ మీద పిచ్చ కోపంగా ఉన్న బాలకృష్ణ : Rating: 5 Reviewed By: TeluguPeople Adda