Trending
Tuesday, 18 August 2015

మంత్రి నారాయణ ని అరస్ట్ చెయ్యాలి - జగన్


మంత్రి నారాయణ ని అరెస్ట్ చెయ్యాలి - జగన్


కడప శివారు లోని నారాయణ కాలేజీ విధ్యార్దునుల అనుమానాస్పద మృతి మీద వై కా పా సీరియస్ గా రియాక్ట్ అవుతోంది , మృతుల కుటుంబాలను వెంటనే పరామర్శించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు పైనా చంద్రబాబు తీరు పైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రి నారాయణ ని వెంటనే అరస్ట్ చెయ్యాలని జైల్లో పెట్టాలి అని ఆయన డిమాండ్ చేసారు. విద్యార్ధినులు మృతి కి నిరసన గా రేపు కడప జిల్లా మొత్తం బంద్ కి పిలుపు ఇచ్చారు జగన్ .

 బంద్ [ప్రశాంతంగా జరగాలి అని అదే సమయం లో పూర్తిగా అవగాహన వచ్చేలాగా జరగాలి అని పార్టీ శ్రేనులని కోరారు జగన్.అంతకుముందు కడప జిల్లా టూర్ లో జగన్... రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. విద్యార్థినుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆపై ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఓవైపు విద్యార్థినులు చనిపోతే.. కడపలో ఉన్న సీఎం చంద్రబాబు కనీసం వారి గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడు సీఎం అయిన ఈ 15నెలల కాలంలో నారాయణ కాలేజీలో చదివే విద్యార్థుల్లో మొత్తం 11మంది చనిపోయారని జగన్ ఆరోపించారు. తిరుపతిలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, నెల్లూరులో నలుగురు, కర్నూలులో ఒకరు, కడపలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారని జగన్ వివరాలు వెల్లడించారు.

నారాయణ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఇంతమంది చనిపోతున్నా.. చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని జగన్ నిలదీశారు. నారాయణ కాలేజీలో చంద్రబాబుకి వాటా ఉందని అందుకే ఆయన నోరు మెదపడం లేదని జగన్ విమర్శించారు. నారాయణ కాలేజీ కాకుండా వేరే కాలేజీలో ఇలాంటి ఘటనలు జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు ఇలానే మౌనంగా ఉండేవారా అని జగన్ ప్రశ్నించారు.

No comments:

Item Reviewed: మంత్రి నారాయణ ని అరస్ట్ చెయ్యాలి - జగన్ Rating: 5 Reviewed By: TeluguPeople Adda