Trending
Monday, 17 August 2015

‘కిక్ 2′ సెన్సార్ డీటైల్స్.! | రవితేజ | రకుల్ ప్రీత్

రవితేజ ‘కిక్ 2′ సెన్సార్ డీటైల్స్.!





రవితేజ ‘కిక్ 2′ సెన్సార్ డీటైల్స్.!

2009 లో కిక్కు కిక్కు అంటూ ‘కిక్’ సినిమాలో తెలుగు ప్రేక్షకులను తెగ నవ్వించడమే కాకుండా, సినిమాలోని ట్విస్ట్ లతో ఆడియన్స్ ని థ్రిల్ చేసాడు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా మాస్ మహారాజ్ రవితేజ చేసిన సినిమా ‘కిక్ 2′. మొదటి సినిమాలో కిక్ అని ఆడియన్స్ కి కిక్ ఇచ్చిన రవితేజ ఈ సినిమాతో కంఫర్ట్ అనేదాన్ని పరిచయం చేయనున్నాడు. తన కంఫర్ట్ లెవల్స్ పక్కవారికి చుక్కలు చూపిస్తాయని, ఆ ఎపిసోడ్స్ చూసే వారికి తెగ నవ్వు తెప్పిస్తాయని ఈ చిత్ర టీం అంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యాక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు.

అంతే కాకుండా ఈ సినిమా చూసి తెగ ఎంజాయ్ చేసామని సెన్సార్ వారు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ ‘కిక్ 2′ సినిమా ఆగష్టు 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి రూట్ క్లియర్ చేసుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించాడు. ఇటీవలే రిలీజ్ చేసిన కామెడీ అండ్ యాక్షన్ ట్రైలర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. కిక్ సినిమాలోని రవితేజ – ఇలియానాల కుమారుడు కథే ఈ ‘కిక్ 2′. కిక్ సినిమాకి సీక్వెల్ అయిన కిక్ 2 కి కూడా వక్కంతం వంశీ కథని అందించాడు. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.




No comments:

Item Reviewed: ‘కిక్ 2′ సెన్సార్ డీటైల్స్.! | రవితేజ | రకుల్ ప్రీత్ Rating: 5 Reviewed By: TeluguPeople Adda