Trending
Monday, 17 August 2015

ర‌వితేజ 'బెంగాల్ టైగ‌ర్' నైజాం హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న గ్లోబ‌ల్ సినిమాస్‌

ర‌వితేజ 'బెంగాల్ టైగ‌ర్' నైజాం హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న గ్లోబ‌ల్ సినిమాస్‌


ర‌వితేజ 'బెంగాల్ టైగ‌ర్' నైజాం హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న గ్లోబ‌ల్ సినిమాస్‌


మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా హీరోయిన్స్ గా, సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న 'బెంగాల్ టైగ‌ర్' చిత్రానికి సంబందించి షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వుంది. ప్రేక్ష‌కాద‌ర‌ణ వున్న‌ చిత్రాల్ని నిర్మించిన‌ కె కె రాధామోహన్ నిర్మాత‌. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బ‌లుపు',' ప‌వ‌ర్' చిత్రాల త‌రువాత ర‌వితేజ‌, ర‌చ్చ చిత్రం త‌రువాత సంప‌త్ నంది కాంబినేష‌న్ లో 'బెంగాల్ టైగ‌ర్' చిత్రం వ‌స్తుండ‌టంతో బిజినెస్ వ‌ర్గాల్లో హ్యుజ్‌ క్రేజ్ వ‌చ్చింది. నైజాం లో అత్తారింటికి దారేది , రేసుగుర్రం లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల్ని పంపిణి చేసిన గ్లోబ‌ల్ సినిమాస్ వారు ఇప్ప‌డు మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ చిత్రం హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారు.

నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ" మా బ్యాన‌ర్ లో మాస్‌మ‌హ‌రాజ్‌ ర‌వితేజ , త‌మ‌న్నా, రాశిఖ‌న్నా లు జంట‌గా తెరకెక్కిస్తున్న 'బెంగాల్ టైగర్' చిత్రం షూటింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా శరవేగంగా జరుగుతోంది. బిజినెస్ స‌ర్కిల్ లో కూడా ప్ర‌త్యేక‌మైన క్రేజ్ వుండ‌టం చాలా హ్య‌పి గా వుంది. నైజాం లో అత్తారింటికి దారేది , రేసుగుర్రం లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల్ని పంపిణి చేసిన గ్లోబ‌ల్ సినిమాస్ వారు మా బెంగాల్ టైగ‌ర్ ని నైజాంలో పంపిణి హ‌క్కులు పొందారు. మా బెంగాల్ టైగ‌ర్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు

ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు న‌టించ‌గా..

బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం భీమ్స్‌

నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

No comments:

Item Reviewed: ర‌వితేజ 'బెంగాల్ టైగ‌ర్' నైజాం హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న గ్లోబ‌ల్ సినిమాస్‌ Rating: 5 Reviewed By: TeluguPeople Adda