Trending
Wednesday, 26 August 2015

రుద్రమ దేవి తెలంగాణా రాణి కాదంట !



రుద్రమ దేవి తెలంగాణా రాణి కాదు అని గునషేకర్ తో పాటు ఆ చిత్రం హీరోయిన్ అనుశ్క మరియూ ఇతరులు జనం మీద రుద్దే పనిలో బిజీ గా ఉన్నారు.వీళ్ళ తెలివి ఎట్లా వుందంటే......... స్వాతంత్యానికి పూర్వం బ్రిటిష్ వారి సామ్రాజ్యంలోనే భారతీయులంతా వున్నారు. స్వాతంత్ర్య యోధులు అల్లూరి సీత రామ రాజు, భగత్ సింగ్, సుభాస్ చంద్ర బోస్, చంద్ర శేఖర ఆజాద్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రు వీళ్ళంతా బ్రిటిష్ యోదులే అంటారా? ఎందుకంటే అప్పటికి భారత దేశం ఆరువందల పైచిలుకు సంస్థానాల తో వుండేది. భారత దేశమే 1947 వరకు లేదు కాబట్టి వీళ్ళంతా బ్రిటిష్ వారికి చెందుతారా? రాణి రుద్రమ విషయం కూడా అలాంటిదే, అప్పుడు ఇప్పటి భౌగోళిక రాష్ట్రాలు లేక పోయినా ఆమె తెలంగాణా కె చెందుతుంది. ఇది కాదనే వారి ఆలోచన ఏమిటో తెలీదు. మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం నుండి విడి పోక ముందు ఆంద్ర ప్రాంతం నుండి స్వతంత్ర పోరాటం చేసిన ప్రకాశం పంతులు, వావిలాల గోపాల క్రిష్నయ్య , పొట్టి శ్రీరాములు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారంటే ఒప్పుకుంటారా?

No comments:

Item Reviewed: రుద్రమ దేవి తెలంగాణా రాణి కాదంట ! Rating: 5 Reviewed By: TeluguPeople Adda