Trending
Saturday, 22 August 2015

మొదటి వారం 101.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ 'శ్రీమంతుడు'


మొదటి వారం 101.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ 'శ్రీమంతుడు'తో కొనసాగుతున్న ఈరోస్ ఇంటర్నేషనల్ జైత్రయాత్ర
 సినీ నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఇండియాలో పెద్ద సినిమా నిర్మాణ సంస్థగా వరుస విజయాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. ఇటీవల ఈ సంస్థ నుండి వచ్చిన బాలీవుడ్ చిత్రం భజరంగీ భాయ్ జాన్ సూపర్ డూపర్ హిట్టై 300 కోట్ల నెట్ సాధించిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ సి.వి. నిర్మాతలు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీమంతుడు చిత్రంలో భాగస్వామిగా అయింది. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో శృతిహాసన్ కథానాయిక. ఆగస్ట్ 7న విడుదలైన శ్రీమంతుడు సూపర్ హిట్ టాక్ తో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను సంపాదించుకుంది. భారీ ఓపెనింగ్స్ తో మొదటివారంలో 101.25 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శృతిహాసన్ లు హీరోహీరోయిన్స్ గా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం బాహుబలి చిత్రం తర్వాత సెకండ్ హయ్యస్ట్ గ్రాస్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని ఈరోస్ సంస్థ శ్రీమంతుడు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియా, ఓవర్ సీస్ సహా 2000 థియేటర్స్ లో రిలీజ్ చేసింది. తమిళ వెర్షన్ లో కూడా శ్రీమంతుడు చిత్రం తమిళనాడు, కేరళలో విడుదలైంది.  ఈ సందర్భంగా...
ఈరోస్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లా మాట్లాడుతూ ‘’సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరోసారి కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మైత్రీ మూవీమేకర్స్ వారికి స్పెషల్ థాంక్స్. మంచి సపోర్ట్ లభించింది. తెలుగు ఇండస్ట్రీలో మేం కూడా పార్ట్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్ లో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
‘శ్రీమంతుడు’ చిత్రాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తమిళనాడు, థాయ్ లాండ్ లో చిత్రీకరించారు. 

No comments:

Item Reviewed: మొదటి వారం 101.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ 'శ్రీమంతుడు' Rating: 5 Reviewed By: TeluguPeople Adda