Trending
Saturday, 25 July 2015

మట్టిముద్దలాంటి నన్ను మనిషిని చేసేరు | నటుడు వినయ్


మట్టిముద్దలాంటి నన్ను మనిషిని చేసేరు | నటుడు వినయ్

నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చి భూమిపైకి తెస్తే సినిమా లోకంలో నాకో గుర్తింపునిచ్చిన గొప్ప తల్లిదండ్రులు రమా రాజమౌళి దంపతులని వర్ధమాన నటుడు వినయ్‌ అన్నారు. బాహుబలి చిత్రంలో నటించిన తనకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందన్నారు. ఇందుకు కారణమైన రాజమౌళి దంపతులకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. బోరబండలో ఓ జిమ్‌లో కోచ్‌గా పనిచేస్తున్న తనకు ‘సై’ సినిమాలో అవకాశం ఇచ్చి సినిమా రంగంలోకి తీసుకువచ్చారన్నారు. ఆ తర్వాత మట్టిముద్దలాంటి తనను ఎంతగానో ఆదరించి మంచి నటుడిగా తీర్చిదిద్దారన్నారు. దీంతో ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాదరామన్న చిత్రాల్లో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారన్నారు

ఇటీవల విడుదలైన ‘బాహుబలి’ చిత్రంలో పాత్ర చిన్నదైనా ఎక్కువ గుర్తింపు వచ్చిందన్నారు. అంతర్జాతీయస్థాయి సినిమాలో నటించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. సినిమా ప్రారంభంలోనే నీటిలో మునిగిపోతున్న బాలుడిని కాపాడే క్యారెక్టర్‌ దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాజమౌళి గారితో పదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆయనలో ఏనాడు కించిత్‌ గర్వం చూడలేదన్నారు. సెట్‌బాయ్‌ నుంచి హీరో వరకు అందరినీ ఒకేలా చూడటం ఆయనకే దక్కిందన్నారు. అంతటి మంచితనమే ఆయన్ని ఓ మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దిందన్నారు. ఓటమి ఎరుగని వీరుడిని నెంబర్‌వన్‌స్థానంలో ఉంచి సమాజం రాజమౌళిని గొప్పగా గౌరవిస్తుందన్నారు. సినిమా ఇండస్ట్రీలో నాకు గుర్తింపు నిచ్చిన రాజమౌళి దంపతులతో పాటు నిర్మాత యార్లగడ్డ శోభు, ఎం.ఎం వల్లి, యూనిట్‌ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.

No comments:

Item Reviewed: మట్టిముద్దలాంటి నన్ను మనిషిని చేసేరు | నటుడు వినయ్ Rating: 5 Reviewed By: TeluguPeople Adda