Trending
Tuesday, 28 July 2015

టీవీ సీరియల్స్ ఆగిపోతాయా..?



టీవీ సీరియల్స్ ఆగిపోతాయా..?


తెలుగు టీవీ చానల్స్ లో సీరియల్స్ ఆగిపోయే సూచనలు ఉన్నాయా..?
టీవీ టెక్నిషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ సమ్మె బాట పట్టబోతోందా..?
సీన్ చూస్తుంటే అలాగే కనిపిస్తోంది.

వేతనాలు పెంచాలంటూ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్ ఆండ్ వర్కర్స్ ఫెడరేషన్ సమ్మె బాట పట్టబోతున్నట్టు సమాచారం.

టీవీ ఫెడరేషన్ లోని అనుబంధ సంఘముల కార్మికులు, సాంకేతిక నిపుణుల వేతనాలు పెంచమంటూ 'తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్'ను పలుమార్లు కోరినా ఫలితం లేకపోవడంతో ఆగస్టు 3వ తేదీ నుంచి సమ్మె బాట పట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వేతనాలతోపాటు తమకు టైమింగ్ నిర్ణయించాలని టీవీ ఫెడరేషన్ కోరుతూ వస్తోంది. అయితే తమకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇక నిరసన కార్యక్రమాల్లోకి దిగాలని టీవీ ఫెడరేషన్ లోని 14 శాఖల కార్మికులు యోచిస్తున్నారు.

నిజానికి 14 శాఖల కార్మికులు సమ్మె చేస్తే ఒకట్రెండు రోజుల్లోనే టీవీ సీరియల్స్ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అయితే అటువంటి పరిస్థితి వస్తే, టీవీ చానల్స్ కు, ముఖ్యంగా ప్రొడ్యూసర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మరి ఈ పరిస్థితుల్లో 14 శాఖల కార్మికులు కోరుతున్న వేతన సవరణకు ప్రొడ్యూసర్లు ఒప్పుకుంటారో లేదో చూడాలి.

No comments:

Item Reviewed: టీవీ సీరియల్స్ ఆగిపోతాయా..? Rating: 5 Reviewed By: TeluguPeople Adda