Trending
Saturday, 25 July 2015

చిరు పుట్టినరోజున మెగా హీరోల ట్రైలర్ల పండగ



ఒక్కడిగా మొదలు పెట్టి, ఒక సామ్రాజ్యమే సృష్టించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. క్రమ శిక్షణ, కష్టాన్నే నమ్ముకుని చిరంజీవిగా, ఓ తిరుగులేని మెగాస్టార్ గా ఎదిగాడు. ఆగష్టు 22న మెగాస్టార్ 60వ పుట్టిన రోజు అంటే అభిమానులకు పండగ రోజు. మామూలుగానే రచ్చ రచ్చ చేసే మెగా అభిమానులు చిరు పుట్టిన రోజును మామూలుగా చేయరు కదా.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని మెగా వారోత్సవాలు చేయడానికి అభిమానులతోపాటు, మెగా హీరోలు సిద్ధమైపోయారు. ఎప్పటిలానే మెగా అభిమానులు రక్త దానం, నేత్ర దానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చిరంజీవికిది 60వ పుట్టిన రోజు అందునా దాదాపు 7 సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి చిరు రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో మెగా కాంపౌండ్‌లో పండగ వాతావరం నెలకొంది. కాగా చిరు 150వ చిత్రం కూడా ప్రారంభించనున్నారు. చిరు పుట్టిన రోజు వేడుకను భారీ స్థాయిలో విజయవంతం చేసేదిశగా ప్రణాళికలు చేస్తున్నారట.

చిరుకు గిఫ్ట్‌గా మెగా హీరోలంతా తమ సినిమాల ట్రైలర్లు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టైమ్ కరెక్ట్‌గా కలిసి వచ్చింది మరి. రామ్ చరణ్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న మైనేమ్ ఈజ్ రాజు, వరుణ్ తేజ్, క్రిష్ కాంబినేషన్‌లో ముస్తాబవుతున్న కంచె, సాయి ధరమ్ తేజ్, గబ్బర్‌సింగ్ దర్శకుడు హరీష్ శంకర్‌ల సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పవర్ స్టార్ సర్దార్ (ట్రైలర్ వీలుకాకపోతే కనీసం ఫస్ట్ లుక్ అయినా విడుదల చేస్తారట) చిత్రాల ట్రైలర్లతో మెగా పండగను మరింత భారీగా చేయనున్నారన్నమాట. బన్నీ ఒక్కడు మిస్సయ్యాడనుకుంటున్నారా బన్నీ కూడా రంగంలోకి దిగి ఆలోగా కిక్కిచ్చే గిఫ్ట్ ఇస్తాడట… వెయిట్ అండ్ సీ…

No comments:

Item Reviewed: చిరు పుట్టినరోజున మెగా హీరోల ట్రైలర్ల పండగ Rating: 5 Reviewed By: TeluguPeople Adda