Trending
Tuesday, 23 June 2015

క్లయిమాక్స్ లో ‘త్రిపుర’ | స్వాతి


స్వాతి టైటిల్ రోల్ లో జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘త్రిపుర’. ‘గీతాంజలి’ ఫేం రాజ కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.

ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ – “ఈ నెల 15న ఈ చిత్రం క్లయిమ్యాక్స్ చిత్రీకరణ ప్రారంభించాం. నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్ తో రెండు పాటలు మినహా సినిమా పూర్తవుతుంది. వచ్చే నెల మొదటి వారంలో పాటల చిత్రీకరణ మొదలుపెడతాం. ఒకటి స్వాతి ఇంట్రడక్షన్ సాంగ్. ఈ పాటను తమిళనాడులోని కుట్రామ్ లో, మరో పాటను పొల్లాచ్చి, కొడైకెనాల్ లోనూ చిత్రీకరించనున్నాం” అని చెప్పారు.

చిత్రవిశేషాలు చెబుతూ – “ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. స్వాతి అత్యద్భుతంగా నటిస్తోంది. త్రిపుర పాత్రను తను తప్ప ఎవరూ చేయలేరేమో అన్నంతగా నటిస్తోంది. మరో పాత్రను పూజా రామచంద్రన్ చేస్తోంది. తను కూడా బాగా యాక్ట్ చేస్తోంది. రాజ కిరణ్ అద్భుతమైన కథ రాశారు. ఆ కథను అంతే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. కథ, కథనం, స్వాతి నటన, రాజ కిరణ్ టేకింగ్, ఫైట్ మాస్టర్ విజయన్ సమకూర్చిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. కథ డిమాండ్ మేరకు రాజీపడకుండా ఖర్చు పెట్టి తీస్తున్నాం” అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ – “బలమైన కథతో ఈ చిత్రం చేస్తున్నాం. త్రిపుర ఏం చేస్తుంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది” అని చెప్పారు.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్, కథ-దర్శకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు

TAGS :: క్లయిమాక్స్ లో ‘త్రిపుర’, Climax lo Tripura, Swathi, Tripura Movie Tolly News, Tripura Movie news, Tripura Movie,

No comments:

Item Reviewed: క్లయిమాక్స్ లో ‘త్రిపుర’ | స్వాతి Rating: 5 Reviewed By: TeluguPeople Adda